హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) కబడ్డీ ట్రైనింగ్ అకాడమీకి ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి చెందిన వి. పవన్ ఎంపిక కావడం అభినందనీయం అని మంత్రి సత్య కుమార్ అన్నారు. ధర్మవరంలోని ఎన్డీయే కార్యాలయంలో పవన్, కోచ్ పృధ్వీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రాతినిథ్యం వహించిన పవన్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం శాయ్ కు ఎంపిక కావడం హర్షణీయం అన్నారు.