ధర్మవరం పట్టణంలో లబ్ధిదారులకు వినికిడి పరికరాలను మంత్రి సత్య కుమార్ శుక్రవారం అందజేశారు. పట్టణంలో ఇటీవల చేపట్టిన పాదయాత్ర సందర్భంగా చాలా మంది నుంచి మంత్రి కి వినికిడి పరికరాల గురించి విజ్ఞప్తులు అందాయి. ఆ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వినికిడి పరికరాలను సమకూర్చాలని ఆదేశించారు. వాటిని ఈరోజు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వారికి అందజేశారు.