ధర్మవరంలోని గాంధీనగర్ లో మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ లాండ్రీ షాపు వద్ద రజకుడితో ఆప్యాయంగా ముచ్చటించారు. అప్పట్లో తానే ఉతికి, ఇస్త్రీ చేసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.