ధర్మవరం పట్టణం గాంధీనగర్ చౌడమ్మ దేవాలయం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కాలుకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్ ని పిలిపించి హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.