టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ కార్యకర్త బళ్లారి నాగరత్నమ్మ కుటుంబానికి పరిటాల శ్రీరామ్ సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. పార్టీకి ఆమె అందించిన సేవలు అమోఘమని, అకాల మరణం బాధాకరమని తెలిపారు. ఆమె భర్త వెంకటేష్‌కు టీడీపీ పట్టణ కార్యాలయంలో ₹40,000 ఆర్థిక సహాయం అందించారు. టీడీపీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.