ధర్మవరం పట్టణం 19వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు 4. 1 కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వార్థులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు.