ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా మా కూటమి ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని, ధర్మవరం పట్టణంలో పచ్చదనాన్ని పెంచడంలో యువత, ప్రజలు, స్థానిక సంస్థలు కలసికట్టుగా పనిచేయాలి అని మంత్రి తెలిపారు.