ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన తనకల్లు మండలం ఎర్రగుంట్లపల్లికి చెందిన విశ్వనాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూ. 4 లక్షలు సుపారీ ఇచ్చి మామే అల్లుడిని హత్య చేయించినట్టు విచారణలో తేలింది. 5 గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హేమంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. విశ్వనాథ్ అత్త, మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కుమారులకు ఇవ్వకుండా ఆస్తులు అమ్మేస్తున్న అల్లుడిని మామ ప్రశ్నించగా అవమానపరిచాడు. అందువల్లే హత్య చేసారు.