ధర్మవరం పట్టణం తిక్కస్వామినగర్ లో రూ. 60 లక్షలతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, పైప్ లైన్లు నిర్మాణ పనులకు మంత్రి సత్య కుమార్ శుక్రవారం భూమి పూజ చేశారు. పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు మా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఆధునిక మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి తెలిపారు.