ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం వద్ద గురువారం గుర్తుతెలియని యువకుడు (25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు చక్రాల కింద తల పెట్టడంతో తల, శరీరం వేరయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతడి ఎడమచేతిపై "నేహ" అనే పచ్చబొట్టు ఉంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.