ఎస్టీలకు బీజేపీ లో సముచిత గౌరవం

సత్యసాయి జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులుగా వి. నంద నాయక్, సెక్రటరీగా వి. హరి నాయక్ లను బీజేపీ అధిష్టానం నియమించింది. బుధవారం పుట్టపర్తిలో జిల్లా అధ్యక్షులు GM. శేఖర్ ను కలిసి వీరు సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్, ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్