బత్తలపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స కోసం ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.