ధర్మవరం పట్టణంలో డిమాండ్ల సాధనకు మున్సిపల్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక యూనియన్ అధ్యక్షుడు బొగ్గు నాగరాజు మాట్లాడుతూ.. జీఓ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఈ అర్ధరాత్రి నుంచి అత్యవసర సేవలు వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, పైపు లైన్ మరమ్మత్తులు నిలిపివేస్తామని హెచ్చరించారు.