ముదిగుబ్బ మండల కేంద్రంలో రైతులకు టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేశారు. ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో సమ్మర్ పంటల సాగును ప్రోత్సహించడం, పండిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా (TCGS-1694) రకం వేరుశనగ విత్తన కాయలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీంద్ర, ఎఫ్ పి ఓ సంస్థ సీఈవో వెంకటేష్ నాయక్, రైతులు పాల్గొన్నారు.