ముదిగుబ్బ మండలం గరుగు తండాకు చెందిన రైతు లక్ష్మిరామ్ నాయక్ పొలంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, పైపులైన్లు, మోటార్ వైర్లు దగ్ధమయ్యాయి. రైతుకు సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు లక్ష్మిరామ్ నాయక్ కోరారు.