బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామంలో, బ్యాల ఆదినారాయణ రవీంద్ర ఆచారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరాయి. మాజీ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి సత్య కుమార్ ల అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాము పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.