ధర్మవరంలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ధర్మవరం పట్టణంలో కొత్తపేటకు చెందిన చంద్రమోహన్ అనే చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం చంద్రమోహన్ మగ్గం నేస్తూ బ్రతుకు తెరువు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్