ధర్మవరంలో నేడు ఉదయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి మడుగుతేరు కార్యక్రమానికి మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని స్వామివారికి మొక్కుకున్నారు. శతాబ్దాల చరిత్ర గల లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో ముఖ్య భాగమైన మడుగుతేరుకు హాజరైనందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.