ముదిగుబ్బ: క్వారీలో కింద పడి వ్యక్తి మృతి

ముదిగుబ్బ మండలం నాగలగుబ్బల వాసి రఘురాం(32) బతుకుతెరువు కోసం అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి వెళ్లి మృతి చెందాడు. మృతుడు జక్కలచెరువు వద్ద రాళ్ల క్వారీలో బుధవారం డ్రిల్లింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు 150 అడుగుల కింద పడ్డాడు. తోటి కార్మికులు చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతి చెందాడు. భార్య అశ్విని ఫిర్యాదు మేరకు ఎస్సై సురేశ్ పంచనామా నిర్వహించి, గురువారం పోస్టుమార్టం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్