ముదిగుబ్బ మండలంలోని మలక వేముల గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులను మండల ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టితో, శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలకు మూడు లక్షల రూపాయల నిధులతో ఈ అదనపు గదులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.