ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 18వ రోజు కూడా కొనసాగాయి. యూనియన్ నాయకుడు జయకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్డ్ సర్వీసెస్ ను రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికులకు (ESI) సౌకర్యం కల్పించాలన్నారు. మున్సిపాలిటీలో అత్యవసర సేవలు కూడా నిలిపివేసి నిరసన చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.