ధర్మవరం పట్టణ వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నరసింహులు

ధర్మవరం పట్టణానికి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బడన్నపల్లి నరసింహులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్