ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని పిఆర్టి వీధిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.