ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్ చౌడమ్మ దేవాలయం దగ్గర శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి టూ వీలర్ పైన వెళ్తుండగా లారీ ఢీకొని అతని కాలికి తీవ్ర గాయాలు అయినాయి. స్థానికులు అతన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.