ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) పై దిశా నిర్దేశం చేశారు. గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, SIR పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఉండాలని సూచించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.