జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ, తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి రెండు రాష్ట్రాలు సమానమని, ఆయన ఎప్పుడూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటారని తెలిపారు. పేర్ని నాని లాంటి వారిపై విమర్శలు గుప్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి బుద్ధి చెప్పినా ఇంకా జ్ఞానోదయం కాలేదని, వారి పార్టీకి ప్రజలు గోరి కట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.