నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనిఖీ జరిగింది. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాలు, ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు. పలు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉమాదేవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.