ప్రకృతి వ్యవసాయ పొలాన్ని పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం

శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లి గ్రామంలో రైతు కొట్టం ప్రసాద్ ప్రకృతి వ్యవసాయ పొలాన్ని రాష్ట్ర స్థాయి పరిశోధనా బృందం 2026, ఏప్రిల్ 29న సందర్శించింది. వేరుశనగ పంట సాగు విధానాన్ని పరిశీలించిన పరిశోధకులు, రసాయనాలు లేకుండా గోపేడ, గోమూత్రం వంటి సహజ వనరులతో సాగు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మట్టి పరీక్షలు నిర్వహించి నేల సారవంతత, పోషకాల స్థితిని అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో శర్మ, హేవినాష్, రెడ్డి నాగేష్, మెంటార్ ప్రసాద్, రైతు అదిశేషు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్