ముదిగుబ్బ మండలంలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని సీపీఐ మండల కార్యదర్శి చల్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం మండల తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. 2018 నుంచి పాత పట్టా భూములు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. నెల కిందట మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.