శుక్రవారం ధర్మవరంలో భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత యాత్రను బీజేపీ నేత హరీశ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాత్ర గాంధీనగర్ శ్రీ మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సమాజ సేవకులు, మహిళలు పాల్గొన్నారు.