ఏటీఎం మెషీన్‌ దొంగల కోసం రంగంలోకి ఆరు బృందాలు

ధర్మవరంలో ఐడీఎఫ్‌సీ ఏటీఎం మెషీన్‌ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలో, నిందితులు మెషీన్‌ను రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని పొలాల్లో ధ్వంసం చేసి, అందులోని రూ.7.50 లక్షల నగదును దోచుకున్నారు. నిందితులు ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఘటన రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం హోసూరులోనూ ఇదే తరహాలో జరగడం గమనార్హం. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్