చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

ధర్మవరం పట్టణం ఏడవ వార్డు శివానగర్లో వెలసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. మాఘమాసం సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు జరిగినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ అమ్మవారిని దర్శించుకుని, పూజల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్