ధర్మవరం పట్టణంలోని రఘు మేడ్జ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు గురువారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు, కరపత్రాలు, ప్రచార బ్యానర్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అనంతరం, తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.