ముదిగుబ్బ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు, పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై తీవ్రంగా మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా ముదిగుబ్బ పట్టణంలోని శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను నీటితో శుద్ధి చేశారు.