ఆదివారం, ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పంచాయతీ అధ్యక్షుడు శేఖర్, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు సూర్యనారాయణ, ఐటీడీపి ఉపాధ్యక్షుడు తిరుమలేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.