ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ధర్మవరం చేనేత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ మాట్లాడుతూ, చేనేత సమస్యల సాధన కోసం ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నాకు విచ్చేసి విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్