తాడిపత్రిలో వాహనాల తనిఖీ: రూ.1,035 జరిమానా

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు నిర్వహించారు. బైపాస్‌లో టౌన్ సీఐ ఆరోహణరావుతో కలిసి నిబంధనలు పాటించని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెల్మెట్లు ధరించని వారికి రూ.1,035 జరిమానా విధించి, తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్