అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఊబిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులందరూ పరీక్షల్లో విఫలమయ్యారు. ఈ పాఠశాలలో కేవలం నలుగురు పదో తరగతి విద్యార్థులు ఉండగా, వారికి బోధించడానికి ఏకంగా ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అందరూ ఫెయిల్ అవ్వడంతో ఈ పాఠశాల తీవ్ర విమర్శలకు గురైంది. విద్యార్థుల భవిష్యత్తుపై ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, బోధనా పద్ధతులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.