గుత్తి మండలంలో కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేరుశనగ, ఆముదం, కంది, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. సాగు మొదలుపెట్టి 20 రోజులు గడిచినా వర్షం రాలేదు. పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు లేకపోవడంతో వరుణదేవుడి కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.