పామిడి మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం 24న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 25న ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు. జీరో అడ్మిషన్ల ప్రక్రియను 26వ తేదీన పూర్తి చేయనున్నారు.