గుత్తి రైల్వే డీజిల్ షెడ్ 62వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సీనియర్ డీఎంఈ రమేష్ చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, కార్మికులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందని సీనియర్ డీఎంఈ రమేశ్, ఏడీఎంఈ జాన్ పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.