పామిడి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న గేదెను కోళ్ల వ్యాను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ప్రమాదానికి కారణమైన వ్యానును అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పరారీ కావడానికి ప్రయత్నించాడు. అనంతరం వ్యానుతో పాటు డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.