గుత్తి మండలం పూలకుంటకు చెందిన యువ రైతు కాశీనాథ్, దాయాదులతో పొలం తగాదా విషయంలో మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఆయన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.