గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముండే షాహినా అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. షాహినా మూడు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా, తలుపులు తెరిచి ఉండటంతో పాటు బీరువాలో దాచిన 4 తులాల బంగారు నెక్లెస్, మాటీలు కనిపించలేదు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టారు.