పామిడిలోని బెస్తగేరిలో గంగమ్మ వార్షికోత్సవ గ్రామోత్సవం అత్యంత వైభవంగా ఆదివారం రాత్రి జరిగింది. అమ్మవారి మండపాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్ది, ఊరేగింపు నిర్వహించారు. బెస్త సంక్షేమ సంఘం సభ్యులు బాణాసంచా పేలుళ్లు, మంగళ వాయిద్యాలు, ఉరుముల వాయిద్యాలు, గొరవయ్యల నృత్యం, కోలాటాలతో ఈ వేడుకను మరింత రక్తి కట్టించారు.