కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ గుంతకల్లు పర్యటనకు శనివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళా మోర్చా నాయకురాలు వన గొంది విజయలక్ష్మి హారతి ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. కాగా మంత్రి నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.