గుంతకల్లు: ప్రేమ పేరుతో మోసం చేసిన వీఆర్వో

వీఆర్వో మహమ్మద్వలి మాయమాటలతో రెండో వివాహం చేసుకుని గర్భం దాల్చిన తర్వాత ఆమెను తిరస్కరించిన ఘటనపై బాధితురాలు గుంతకల్లులో పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆమెకు ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకుని కుమారుడితో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కొడుకు పేరును రేషన్ కార్డులో ఎక్కించడం కోసం వెళ్లినప్పుడు వీఆర్వో పరిచయం అయి అనంతలోని ఓ దర్గాలో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య, కుటుంబీకులు వచ్చి యువతిని కొట్టి కాపురం చేస్తే చంపేస్తామంటూ వీఆర్వో అన్న, వదినలు బెదిరించారు. వీఆర్వో పై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్