గుత్తి RS రోడ్డులోని లక్ష్మమ్మ గుడి వద్ద కుక్కను తప్పించబోయి సోమవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకోగా, ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారు ఎరికలప్ప, విజయలక్ష్మి, వీరభద్రప్ప, రాజ్ కుమార్, రాజు, తిమ్మప్పగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.