గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. కార్మిక సంఘం అధ్యక్షుడు రాజా నేతృత్వంలో ఈ సమ్మె ప్రారంభమైంది. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.