గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం సఫాయి కర్మచారి (పబ్లిక్ హెల్త్ వర్కర్స్, వారి కుటుంబ సభ్యులకు) గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.